పులుగుల అందము
పులుగులెల్లజగతి పుణ్యంపు రాసులె
నలువయొసగెకాదె నరులు కొరకు
అందచందములెల్ల నారబోసినయట్లు
ఖగములెల్లమనకు కనుల విందు
బేలతనముచూపి భేషనిపించును
ముక్కు సూటిదనము ముద్దుకోరు
చిట్టిపొట్టిపలుకు చిలుకపలుకులెల్ల
హాయినింపుమనకు నాత్మలోన
ఆ.వే కోకిలంపు కూత కోటికోరికలను
గుర్తు చేయు మనకు గుణిత మెట్లు
రెక్క లార్చి పులుగు రివ్వున గగనాన
ఎగిరినటుల మనసు యెగురు నేమొ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి