శిల్పకళ
అందమౌ శిల్పంబు నధ్భుతంబౌనట్లు
జక్కన చెక్కిన చక్కదనము
పూర్వపుణ్యంబంత పురుడుపోసినరీతి
చైతన్యమందెను శిలయుకూడ
చరణమ్ము మ్రొక్కగా చరితార్థమౌజన్మ
అభయమొసగునట్టి హస్తమిదియె
సౌందర్య వదనమ్ము శాంతగంభీరమ్ము
అరవిందనేత్రుని యందమోయి
శంఖమ్ము ధరియించి చక్రమ్ము చేపట్టు
మాధవు చూడగా మనసునిండు
కంబుకంఠమ్ముతో కమనీయ రూపంబు
కన్నుల పండుగె కనులకింక
ఆ.వె.అంబుజోదరుండు నఖిలాంతరాత్మడు
ఆర్తి జనుల కెల్ల నండదండ
విశ్వమయుడు తాను వీష్ణుండు జిష్ణుండు
భక్తి జనులకింక భధ్రమొసగు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి