కైలాసశైలము

కనుమోయి కనుమోయి కైలాస శైలాన్ని
కైవల్య నిలయాన్ని కాంచరండి
మానస సరసిలో మదమరాళమటుల
విహరించ రండయ్య విభుదు లెల్ల
ఇహలోక మందున్న యీశ్వరనిలయాన్ని
దర్శించ రారండి తప్పకుండ
హిమశైలశిఖరాన హైమవతీశుండు
గిరిరాజకన్యతో తిరుగునచట
దివిజగంధర్వాది త్రిదశేశ్వలెల్లరు
భక్తితో ధ్యానించు భద్రనగము
ఆ.వె.పాహి పాహియనుచు పరమేశు ధ్యానించ
భవ్యమైన తావు వసుధ లోన
భక్తవరుదుడతడు భక్తమానసహంస
ఇందు ధరుడుతానుయింపు గూర్చు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత