హనుమ

అనిశము రామపదార్చనంబొనరించు
పవనసుతడెపుడు ప్రక్క నుండ
మాకింక కొరతేమి మచ్చుకైననులేదు
అంజనాసుతుడంత నభయ మొసగ
మాకేమి లేక్కొయి మహిని సుమ్ము
మనొజవుండతడోయి మారుతతుల్యమౌ
వేగమ్ముతోతానువిజయమిచ్చు
బలమును బుధ్ధియు వాక్పుటత్వమొసగు
నిర్భయతనొసగు నిపుణు డతడు
కాంచనాద్రి సముని కమనీయ విగ్రహు
ధైర్యమొసగు నతడు  శౌర్య మూర్తి
ఆచరించవలయు యంజనా సునునకు
వేల వందనాలు వేడు కోలు
(రచన:-- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత