మధుర మీనాక్షి అధ్భుత లీల

.అమ్మ మనసు వెన్న.అనురాగమంతా రాశిబోసి ఆ జగదంబ తనకు మారుగా
అమ్మను అవనికి పంపిడేమో! Ko కష్టాల్లో కంటికి రెప్పలాకాపాడుతుంది కన్నతల్లి.
శిశువునుండి పశువు వరకు,రాజునుండి పేదదాక ఎవరైనా అమ్మ అనురాగం  పొందని వాడు ఎవడూలేడు.డిల్లికి రాజైనా అమ్మకు కొడుకే కదా!
ఈలలోని కన్నతల్లి కే తనసంతానంపై ఇంత అనురాగముంటే సదాశివకుటంబిని యైన ఆ అమ్మలగన్నయమ్మకు తన బిడ్డలపై ఎంత ప్రేమలు ఉంటుందో మీరే ఊహించుకొండి. పైగా ఆ అమ్మ "ఆబాలగోప విదిత"
యాదేవి  సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమఃతస్మై నమఃతస్మై నమఃతస్మై నమోనమః"అని దేవి మహాత్మ్యంఅమ్మను  కీర్తించింది.
జగన్మాత కరుణారస సాగర.ఆ జగదంబ "దేశకాలా2,పరిఛ్ఛిన్న" అమ్మ అనుగ్రహానికి ఎల్లలు లేవు.
అది ఎలా నిజమో యీ వాస్తవ సంఘటన ద్వారా తెలుసుకొందాం.
ఇప్పుడు చెప్పబోయె కట్టుకథా,కాకమ్మ కథ, కల్పిత కథ కాదు.చారిత్రక సంఘటన .రుజువులు సాక్ష్యలు  వున్నాయి. వుండవలసినది ఆస్తిక బుధ్ధి.మన వేదాలు,ఇతిహాసాలపై శ్రధ్ధ. పెద్దల మాటపై గౌరవం.
ప్రకృతానికొద్దాము.జగన్మాత కరుణారససాగరాన ఓలలాడిన ఒక విదేశీయుడీ కథ.
మనదేశానికి వర్తకం నిమిత్తం వచ్చి విభజించి పాలించు సిధ్ధాంతాన్ని పాటించి దేశాన్ని బానిసత్వంలోకి నెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ చేమధురకు కలెక్టర్ గా నియమించబడిన రౌస్ పీటర్ కథనే మనం ఇప్పుడు ముచ్చటించుకో బోతున్నాము.
గంజాయి వనములో అప్పుడప్పుడు తులసి మొక్కల్లా వారిలో మంచివారూవుంటారు.అట్టి వాడే మనకలక్టర్ దొర.
అతడు తనవిద్యక్త ధర్మాన్ని శ్రద్ధతో ఆసక్తితో నిర్వహించేవాడు.
అలా ప్రజానీకానికి సేవలు చేస్తూ వారి మనస్సులను దోచుకొన్నాడు.ఇప్పుడు చెప్పబోయె సంఘటన జరిగి సుమారు 200 వందల సంవత్సరాలైంది.క్రీస్తుశకం 1812ల జరిగిన ముచ్చట.
మధురానగరము పుణ్యక్షేత్రమే కాదు పెద్దపట్టణముకూడా!.,
ఇతడు ఇతర ఆంగ్లేయాధికారుల్లా దోచుకో దాచుకో మనస్తత్వం కలవాడు కాడు.ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలూ పాటు పడేవాడు. ఆనాటి రాజకీయ దురదృష్ట పరిస్తితుల వల్ల ఆ ప్రాంతంలో అశాంతి నెలకొందిఆ సమయంలో ప్రజలకు మనశ్శాంతిని సుఖసంతోషాలు కల్పించడానికి విశ్వప్రయత్నం చేసి సఫలీకృతుడైనాడు.
ఇలా మధురానగరానికి కలెక్టరు గా తనవిధులు చక్కగా నిర్వర్తిస్తూ వారి మనస్సులో కొలువున్నాడు.ప్రజలు కూడా తమపాండ్య ప్రభువులను పిలిచినట్లు పీటర్ పాండ్యన్ అని ఆప్యాయంగా పిలుచుకొనే వారు.
ఇతడు ప్రతినిత్యము తన అధికారకార కార్యక్రమాలను ప్రారంభించేముందు మధుర మీనాక్షీ ఆలయానికి ముమ్మారు ప్రదక్షణచేసి,దేవాలయ ప్రధానద్వారానికి ఆంగ్లేయ రీతిలో వందనము చేసి,తన అధికారిని జులైలో నిమగ్నమయ్యేవాడు.తన అధికారవిధుల్లో ఆలయనిర్వహణ పరిరక్షణలు తన బాధ్యతగా భావించేవాడు.అతడు ఇలా చక్కగా జగన్మాత మధురమీనాక్షితో చక్కనిఆత్మీయతానుబంధమును ఏర్పరుచుకొని చూపాడు.అతడు అంతర్ముఖుడై అమ్మను ఏమడిగేవాడోఏమిప్రార్థించే వాడో ఆ  అమ్మకు,అతనికి మాత్రమే తెలుసు. ఆ అమ్మ ఎంతైనా భక్తిగమ్య భక్తివస్య.కదా!
ఇలా ఎన్నో రోజులుగడిచాయి,రోజులువారాలు నెలలుగా సంవత్సరాలుగా గడిచే పోతున్నాయి. ఆలా గడించి పోతున్న కాలంలో ఒకరోజు ఒక అద్భుతంజరిగింది.ఆరోజు సాయంకాలం మేఘావృతమై వుంది.చిటపటచినుకులతో ప్రారంభమైన వాని కుండపోతగా కురిసినా రెండింటిని.ఈదురుగాలులు ఈడ్చి ఈడ్చి కొడుతున్నాయి.ఉరుములతో మెరుపులతో వాతావరణం భయంకరంగా మారింది.నిజంగా ఆరాత్రి కాళరాత్రిని తలపిస్తుంది.ఎటుచూచినా చిమ్మచీకటి,అలముకొన్న ఘాఢాంధకారము.మెరుపుల కాంతి తప్ప మరోకాంతి లేదు.బయట ఇంత ఉత్పాతము సంభవిస్తున్నా మనకలెక్టర్ దొర గాఢనిద్రలో ఉన్నాడు.కార్యభారముతో అలసిపోయాడేమో? ఒళ్ళు మరచి నిద్రిస్తున్నాడు.
అప్పుడు జరిగిందో అత్యద్భుతం.ఆ కాలంలో కలెక్టర్ నివాసం ఒకరాజ భవనం లావుండేది.అన్యులకు ప్రవేశం అశక్యం.అలాంటి పరిస్థితిలో  ఒక చిన్నారి బాలిక చిచ్చెరపిడుగులా ప్రవేశించి,తనబుడిబుడినడకలతో కలెక్టర్ పడకగదిలో ప్రవేశించి ,తన చిట్టి చేతులతో రౌస్ పీటర్ దొరను తట్టిలేపడమేకాదు.అతని చేయిపట్టుకుని లాగుకో పోవడం మొదులు పెట్టింది.రౌస్ పీటర్ ఆ క్షణములో అప్రతిభుడయ్యాడు.అసలేమిఝరుగుతుందో అర్థం కావడంలేదు.ఏదో మంత్రంవేసీనట్లు ఆ చిన్నారి పిల్లను అనుసరించి సాగాడు.అలా ఆ యిద్దరూ ఆ కలెక్టర్ బంగ్లా నుంచి బయటికి రాగానే కళ్ళుమిరమిట్లుగొలిపె పెద్ద కాంతితో చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దము తో ప్రళయభీకరమైన పిడుగు కలెక్టర్ బంగ్లాలో కలెక్టర్ పడకగదిపై పడింది.ఇదంతా కొద్ది క్షణాల్లోనే జరిగింది.బంగ్లా నుంచి బయటకు రావడం క్షణం ఆలస్యమైనా అతడు ప్రాణాలతో వుండేవాడుకాదు.
హాయిగా సుఖంగా నిద్రించే తననుఇలా అకస్మాత్తుగా బలవంతంగా బయటికి లాక్కువచ్చిన గడుసు పిల్ల ఎవరు? ఎక్కడనుంచి వచ్చిందని ఆలోచనలు ఒకవైపూ,అంత అమాయకత్వం గా ,అయోమయంగా ఎలావచ్చాననే ఆలోచనలలో ఉన్న సమయంలోనే ఈ పిడుగుపాటు ఘటనా సంభవించింది.క్షణములోనే ఇలోచనలనుంచి తేరుకొన్న కలెక్టర్ తనను ఈ ఇంట్లోనుంచి రక్షించిన చిన్నారి గురించి ఆలోచనవచ్చింది.అలా ఆలోచన వచ్చిన వెంటనే తలత్రిప్పగానే ఆ అమ్మాయి ప్రఫుల్లవదనంతో చిరునవ్వులు చిందిస్తు పరుగెత్తి సాగింది.తనప్రాణదాతయైన చిన్నారిని అభినందనలతో ముంచెత్తాలని ఆత్రుతతో అంతేవేగంగా అనుసరించసాగాడు.తాను ఎంత వేగంగా పరిగెత్తినా ఆ అమ్మాయిని అందుకోలేకపోయాడు.అందీ అందనట్లు వుండడమే  ఆ మహామాయ ఆంతర్యము కావచ్చు.అట్లు చిరునవ్వులు చిందిస్తున్న ఆ చిట్టి తల్లి కన్నుమూసి తెరిచేలోగా మధుర మీనాక్షి ఆలయంలో ప్రవేశించి అంతర్ధానమైనది.
అప్పుడతనికి తట్టింది తనను కాపాడిన తల్లిజగన్మాత మధురమీనాక్షియే కానీ మరేవరూ కాదని నిశ్చయించుకొన్నాడు.ఈ సందడిలో అమ్మవారి పాదాలకు పొదరక్షలు లేకుండా వుండడము అతనికి బాధకలిగించింది.
తనకు ప్రాణరక్షణతో పాటు జగన్మాత ఈ వీధంగా లభించడంవల థనజన్మ  ధన్య మొనదని ఉప్పొంగి పోయాడు.తనను కాపాడిన  ఆ అమ్మరూపాన్ని తనమనస్సులో నింపుకొన్నాడు.
భక్తమానసహంసికయైన ఆ జగన్మంగళ తనభక్త రక్షణార్థము బాల రూపంలో అవతరించి రౌస్ పీటర్ ను కాపాడింది. "నిజమే భక్త ప్రణశ్యతి "(తన భక్తులకు నాశనము లేదు)
అన్నది భగవదనుశాసనము. కదా! అమ్మ పాదాలకు పాదరక్షలు లేకపోవడం అతని మనసుకు కష్టం వేసీంది.ఆలయ అర్చకులను  సంప్రదించి నవరత్న ఖచ్చితమైన బంగారు పాదుకలనూ,అశ్వారూఢయైన అమ్మకు బంగారు రికాబులను సిద్ధం చేసి మురిసిపోయాడు.ఇప్పటికీ అమ్మవారి ఊరేగింపు ల్లో ఆ పాదరక్షలు రికాబులూ,ధరింపజేసే సాంప్రదాయం అమలులో వున్నది.
(హేతువాదులు, జనవిజ్ఞాన వేత్తలు వాటిని దర్శించి తమసంశయాంధకారమును పోగొట్టుకోవచ్చు).ఇవేకాక ఇంకా అనేక అమూల్య మొన ఆభరణాలను అమ్మవారికి సమర్పించాడు.ఇప్పటికీ ఆ తిర్వాభరణాలను అమ్మవారి ఖజానాలో దర్శించ వచ్చు.
అన్నిటికన్నా విచిత్రమైన విషయమేమంటే అతడు తన వీలునామా లో తన మరణానంతరం తనను సమాధి చేసే సందర్భంలో తన తలను దేవాలయమునకు ద్వారానికి ఎదురుగా వుండేటట్లు నిర్మించాలని వ్రాశాడు.అంటే అమ్మ ఎప్పుడూ తనముందే బాలా రూపంలో   వుండాలని అతని ఆకాంక్ష కాబోలు.అతనికోరికకు తగినట్లే అతని సమాధి నిర్మాణం జరిగింది.ఇప్పటికీ ఆ సమాధి అలానే వుంది
అమ్మ అనంతమైన నామాల్లో "దేశకాలా2పరిఛ్ఛిన్నా"అనే నామం వుంది.అమ్మదయా దూరదృష్టికి దేశకాలములనే ఎల్లలు లేవు కదా!
ఇలా రౌస్ పీటర్ అమ్మకరుణకు పాత్రుడై ధన్యడైనాడు.
రౌస్ పీటర్ మహాశయా నీవుధన్యుడవోయి.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత