పానకాల విభుడుం
పానకాలవిభుడు బయలుదేరెనదిగో
భక్తజనుల కెల్ల పండగేను
ప్రహ్లాద వరదుండుభక్తవరులకెల్ల
కొంగుపసిడికాదె కరుణ కల్గి
పత్రపుష్పసమితి పానకమ్మునుకోరు
ఆశ్రిత వాత్సల్య మతని రూపు
తేరులోయేతేరు కారుణ్యమూర్తిని
దర్శించ జన్మమ్ము ధన్యమగును
ఆ.వె.భక్త కల్ప ద్రుముడు ప్రహ్లాద వరదుండు
రాజ్యలక్ష్మి తోడ రక్ష నొసగు
ఆర్తి రక్షకుండు నరివీర మర్దను
వేద వేద్యుడతడు వేడి వలయు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి