చరవాణి -- సంసారము
సంసార సౌఖ్యంబు చరవాణి పాలాయె
ముద్దుముచ్చటలెల్ల మొద్దులాయె
చరవాణి చేనున్న సఖుడేమి.సఖియేమి
మాటపలుకులన్ని మాటు మణుగు
చవాణి లేకున్న సర్వంబు శున్యమ్ము
అడుగు బడుగులేని యంట్లవోలె
చిన్నారి నాడింప చిక్కదు సమయము
చరవాణి చేతిలో చేరగానె
అమ్మనాన్నలన్న నాప్యయ మడుగంట
అలుమగల మధ్య నడ్డునిలువ
తల్లిబిడ్డలన్న తన్మయ భావమ్ము
మరువ జేయునట్టి (జంత్ర)మర్మమిదియె
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి