కవుల కలహాలు
గతరాత్రి కలలోన కవులంత తమలోన
కలహించిరేలనో కపుల రీతి
వచనకవినినేను వచనంబు వినమంచు
బలవంత పెట్టగా కలహ మయ్యొ
వాదకవులమంచు వాదంబు వినమంచు
వాదించ సాగిరి వస్తు వొదిలి
చచ్చెపద్యమనుచు చపలత్వ బుధ్ధితో
చచ్చుకవితచదివె నొకడు
ఆ.వే.హైకు కవిత చెప్పి హేయమౌ రీతిగా
నాసి కవన మంచు నసిగె నొకడు
ఇట్లు కవుల కవిత యిక్కట్లు పాలాయె
కవుల కవిత లన్ని గాలి కలిసె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి