రాయలేలిన సీమ

రమ్యాతి రమ్యమౌ రాయలేలిన సీమ
రతనాల సీమగా రాణుకెక్కె
తిరుమల వాసుండు సిరులకే నాథుండు
కోరిన వారికికోంగు పసిడి
శ్రీశైలనాథుండు శిఖరాయమానుడై
భ్రమరాంబ తల్లితో బ్రదుకు నిచ్చు
నవనందు లానంద నందులై తృప్తితో
భక్తజనులకెల్ల ముక్తి నొసగు
ఓయంచు పిల్వగా నోయంచు బదులిచ్చు
నవనారసింహులు నడచిరాగ
విరుపణ్ణ కట్టించె వీరభద్రునిగుడి
లేపాక్షి బసవన్న లేచి నడచె
ఆ.వే .బుగులుదీర్చునట్టిబుగ్గ రామేశుండు
చెన్నకేశువుతోడ చెలిమిచేసె
తాడిపత్రి యన్న తనువంత పులకించు
కనులపండువగును కాంక్షమీర
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత