గోకీనంత సుఖము

గోకినంత సుఖము కొహినూరు దొరికినా
దొరకదోయి యిలను దొరకదసలు
పుండుపడిననేమి పులకించినట్లుండు
మరుపురానిసుఖము మరులుగొనును
తిమ్మిరంత సుఖముతీరుతీరులనుండు
ఇంద్రుడెదురపడిన యిష్ట పడడు
మనసుచేగానిమ్ము మాటచేగానిమ్ము
వర్ణింపతరమౌను.వసుధ లోన
ఆ.వే అనుభవించినంత.నానంద మందుటె
మాట పలుకు లేని మౌన నియతి
తెలిసి నటుల యుండు తెలియరాకుండును
పరమ సుఖపు రీతి పరిడ విల్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత