ఆటవెలదులు

1.
ఆటవెలదుల తోడియనుబంధమధికమ్ము
పిన్ని విడిచి తాను నిలువదనును
కనులు మూయగానె కాలంలోనే కనిపించి
పద్యరచన చేయపట్టుబట్టు
2
ఆటవెలది కవిత యందాలు చందాలు
నిర్ణయింపదగిన నిపుణ మతులు
త్తత్వమెరిగినట్టి చతురమతులిపుడు
ఆదరింతురన్న యాశనాకు
3.కోడుమూరులోన కోవెల కలదోయి
వల్లెలాంబతల్లి వెలసెనచట
గొల్లపిన్నివారి కొంగుపసిడియనగ
విద్యనేర్పుతల్లి వేదమాత
---------
4అమ్మ మనసు
అమ్మ యనుచు మదిని యార్తితో పిలిచినా
ఆలకించ లేమి యలుకయేల
తప్పు చేసినంత దయతప్పెనాయేమి
తప్పుచేయనట్టి తనయుడెవరు
5
కంటిరెప్పలాగ కాచేటి తల్లివే
కనికరమ్ము చూపకదలి రమ్ము
నన్నుగన్న తల్లి నాటాలి దైవమా
జాగుచేసెదేల జాలిలేదె
6.
కలిమి నిచ్చు తల్లి కలతబాపెడుతల్లి
విద్యనొసగు వమ్ము వినయమిమ్ము
అష్టసిధ్ధీలిచ్చి యాదరించెడుతల్లి
ముక్తి ఫథముచూపు భక్తినిమ్ము
7
కొన్ని కడుపు తీపి కదిలించ లేదేమి
శరణుజొచ్చినాను కరుణజూపు
భక్తివశ్యవనుచు భక్తిగమ్యవనుచు
వాసికెక్కినావు వసుధ లోన
8.తలలు పండెనింక తల్లితో పనియేమి
వీనికనుచు చేయివిడువ దగునె
అరువదేండ్ల బిడ్డ యల్లారు ముద్దుగా
చూడవలదె జనుల చోద్యమొప్ప
9
నీదు పదములంటి నిరతంబు ధ్యానించు
భక్తజనుల కెపుడు భద్రమొసగు
సరసిజాసనాది సురలోక వందిత
వేదవేద్య కివియె వందనాలు
##₹₹₹₹₹₹₹₹₹₹_++++(+(
వారణాసీ వైభవము
1బిందుమాధవుండు యిందుశేఖరుతోడ
వారణాసిలోన వాసముండ
భక్త జనులకెపుడు భద్రమొసగుచుండ
పాపరాశి యెల్ల భస్మ మగును
కాలభైరవుడు
2.కాలభైరవుండు కరుణార్ద్ర చిత్తుండు
కామితార్థ మొసగి కరుణజూపు
కోపగించనేని కొంపముంచునతడు
శివుని నమ్ముకొన్న చింతబాపు
3 దక్షుడనగనేమి తాత యనగనెంత
తప్పు చేసినంత తలనుదీయు
ఆర్తితోడ శిలువ యరుదెంచునంతట
భక్తి చూపగానె ముక్తి నొసంగ

3
విశ్వనాథుకరుణ(కన్న) వినయశీలమొసగ 
కాలభైరవుణ్ణికనుము తొలుత
అతని ఆజ్ఞ యున్న యన్నియూ సమకూరు
కాశివాసఫలము కలంగునీకు
4అన్నపూర్ణతల్లి యన్నంబు పెట్టగా
విశ్వ మర్మమెల్ల విశద పరచు
పెద్ద కనుల తల్లి ప్రేమతో చూడగా
కాశివాసఫలము కల్గు నీకు
5మహిమకల్గునట్టి మణికర్ణికంబున
మునక వేసినంత పుణ్యమబ్బు
కాశికేగెదంచు కలవరించినచాలు
కాసివాసఫలముకలుగునీకు
6మరణ భయము లేక మరణింప వత్తురు
వేనవేల జనులు వేడ్క తోడ
రామమంత్రమూదు రాకేందు వదనుండు
కన్ను మూయువాని కర్ణమందు
7సాక్షి గణపతండ్రు సర్వంబుగనునట
విఘ్నరాశినెల్ల భగ్న పరుపు
అంబవడినిచేరి యాటాడు గణపతి
కోరినట్టివారి కొంగుపసిడి
8
డుంటి విఘ్నరాజు కంటజూచినచాలు
దురితరాశియెల్ల తూలీపోవు
ఆలకించగానె యఖిలంబు సమకూర్చు
మోదకమ్ము లొసగ మోదమందు
&&&&---&&--++++
పరమేశ్వారాను బంధము

1శివుని యాజ్ఞ లేక చీమైనా కదలదు
భవని యాజ్ఞ లేక భవములేదు
హరుని యాజ్ఞ చేత యఖిలంబు లయమందు
మూడుకన్నులాడి ముఛ్చటిదియె
2.అష్ట మూర్తియతడుయసుతోషుడితడు
సర్వశుభములొసగు శంకరుండు
దయను జ్ఞాన మొసగు దాక్షిణ్య మూర్తికి
మ్రొక్కు చుంటినయ్య మోదమలర
3.అంబకరుణ తోడ సాంబశివునియండ
దొరికెనాకు వేరుదారిలేదు
దారిజూపి నన్ను దరినిజేర్చగలుగు
శివుని యండయుండ చింతయేల
4.నాకు జన్మనిచ్చి నన్నివేళలగాచు
చదువు సంధ్యనేర్పి సాకినావు
భక్తిలేని నాకు భవబంధముల్ దీర్చు
మంత్రరాజమిచ్చి మనిచినావు
5. కూడు గూడు నిచ్చి కుశలంబు యొనగూర్చి
కలతలేక నన్ను గాచి నావు
అల్ప ఫలముదొరక యఖిలార్థమట్లుగా
భావశుధ్ధినొసగి మనచినావు
6
గండమాలతోడ గుండాలు దండెత్తి
మాట పలుకు లేక బాధ పడితి
మాట పలుకు నేర్పి మంచివిద్యలనిచ్చి
మనచినట్టి నిన్ను మరువగలనె
&&&&&&&&&&&&&&&&&&&&&&
మా ముత్తాత
1.శేషశాస్త్రి విదుడు శేముషీ విభవుండు
ఈసులేని తల్లి యీశ్వరమ్మ
అవనిలోన వీరు యాదిదంపతులట్లు
మెలగినారు వీరు మైత్రి తోడ
మా తాత సీతారామశాస్త్రి
2
పుణ్యరాశియెల్ల పోగుబడినయట్లు
జననమంది నాడు జనులకు డట్లు
సీతరామశాస్త్రి చిరకీర్తి శాలియై
వసుధలోనచాలవార్త కెక్కె
మానాన్నమ్మ
3అబ్పురంపు గుణము సుబ్బమ్మ తల్లిది
ధైర్యసాహసాల శౌర్యమూర్తి
దివిటి దొంగ లెల్ల దిగజారి పారగా
ఎదురుకన్న యట్టి యేకవీర
వేదమూర్తి పితృదేవుడు
వాసుదేవ శాస్త్రి వర్యుండు నా తండ్రి
వివిధ శాస్త్ర్రవిదుడు విదితయశుడు
వల్లెలాంబతల్లి వరపుత్రు విఖ్యాతి
అంబకరుణచేత యందుకొనియె
2
మాటకటువుమనసునవనీతమౌరీతి
హితము పల్కు చుండు సతతమిట్లు
శాస్త్ర చర్చలోన సాటిరా యెవ్వరు
మేరునగముబోలు మెలగు చుండు
మా అమ్మ రామలక్ష్మమ్మ
1కాశిభట్లగోత్ర కౌస్తుభా భరణమ్ము
గొల్లపిన్ని వారికోహినూరు
రామభక్తి తోడ రంజిల్లు నగుమోము
రామలక్ష్మి సాటి రారు యెవరు
2
బాల్యమందు నేర్పె బాలరామాయణము
ఖడ్గమాల మంత్ర ఖడ్గమొసగె
అమ్మతోడనాకుననుబంధమెక్కువ
అమృత మెట్లు ఘనము యమ్మకన్న
3
రాయలేలినట్టి రత్నాల సీమలో
జననమందినాను జనులు మెచ్చ
తిరుమలేశునికి రుణం తేటతెనుగునేర్చి
బిరుదు పొందినాను బెదురులేక

&&&&&&&&&&&ప్రాణసఖి₹₹₹₹_₹₹###
1ప్రాణసఖిని గంటి భార్యగా నేనంత డే డే
ఆలిగాగ నిన్ను యాదరించు
అమ్మయటులనాకునాప్యాయమందించు
కొంటె తనము చూపకోపగించు
2.కూరికూరిపెట్టు కొసరికొసరినాకు
అన్నమొల్లనన్న నాలుగు తాను
జ్వరము వచ్చి నంత జాగుసేయకెపుడు
కంటిరెప్పలాగ కాచియుండు
3
మనసులోని మాట మదివిప్పి చెప్పదు
తనదుమనసు మాట తనకె తెలియు
నేత్ర సంజ్ఞ తోడ నేర్పుతో తెలుపును
ఎరుగవలయు మనము యెందుకు కల్గి
4ఉప్పునుసిరకట్లు నుద్వాహమొందగా
సీతయనుచు పిలుచు శ్రీమంతురాలిగా
పరుల మంచికోరు ఫడతి తాను
4
నాదు విజయమందు నాలోని శక్తియే
తాను కాక యెవరు రాత్రిలోనే
ఒప్ప తప్పులరసి నోర్మితో గమనించు
దారిచూపునట్టి ధర్మపత్ని
5 నాదు బలమెకాదు నాబలహీనతల్
ఎరుకగల్గినట్టి యోగ్యురాలు
మగని విజయమందు మగువకలదనిన
మాటకల్లకాదు ఖచ్చితమ్ము
####₹₹₹మాతృభాష########
1మాతృభాషలోనే మమకారమొప్పగా
అభ్యసింపవలయుయాంధ్రభాష
తెలుగు రాని వాడు(తెలుగు) తెలివితో చదివినా
తెలియనంత తెలుగు తెలియు లేడు
2
అన్యభాష లెల్లనభ్యసింపవలయు
మనకు పనికి వచ్చు మర్మ మెలిగి
తెలుగువారికెల్ల తేనెలొలుకు నట్లు
తెలుపవలయునీవు తెలివితోడ
3అమ్మ యనుచు పిల్వ నవమాన మేలెనో
మమ్మియనుచు పిల్వ మాన్యతేన
నాన్న యనుచుపిల్వ నగుబాటు యెట్లాయె
డాడియనుచు పిల్వ డాబుయగునె
4అంకులనుచు పిల్వ పెంకులూడగలవు
ఆంగ్లనదములేల యాంధ్రులార!
ఆంటి యనుచు పిల్వ ననురాగ మేముండు
అత్త పేరులోని యాదరమ్ము
5 ఆంధ్రభాషనేర్వ  నృత్యంతో సులభమమ్ము
చదువు పనియులేదు చదువుకుంటూ
తెలుగు వచ్చుననచు తెగువతో ప్రతీకగా
కడుపు మండునాకు కళ్ళజూచి

6ఆంగ్లమాధ్యమమ్ముయత్యవసరమంచు
అలమటించనేల నాంధ్రులార!
తెనుగునుడుల తీపి తెలియకుండా
ఆంగ్లభాష మీకు యర్థ మగునె
7
ఆంగ్ల భాషపలుకనధికుడతడనుచు
చంకగుద్దుకొనగ చక్కబడునె
కార్యదక్షుడైనకార్యముల్ నెరవేర్చు
ప్రజ్ఞ వలయు జగతి పలుకుతున్న
8
తెలుగు వారి కెల్ల వెలుగుజిలుగులిచ్చు
చైత్రమాసమిదియె చేరి రండి
వత్సరాది వచ్చె వాత్సల్య మొప్పగా
పిలువ రండి మీరు ప్రీతితోడ 

వ్యక్తి పూజ చేయ వ్యక్తిత్వం మూడుగంటలు

నీడవంటి బ్రతుకు నీకు దిక్కు

అనుకరించ బోకు నవలక్షణాలను

విధము చెడుకు నీవు వెర్రి తోడ


(అంమట్నిి్ని్నిి్న్న్ని్నిి్ని్న్నిి్్నిి్న

భావిజీవతంబు భారమో భాగ్యమోజరుగు నెవరికెరుక

1ఏదియెట్లుజరుగు యెవరికెరుక

నిన్నునమ్మినాను నీకన్నా దిక్కేది

కావు మయ్య నన్ను కమలనేత్ర

2చేయదగిన పనులు చేయరాని యటులచేయరేలజనులు సిగ్గుపడక

చేయరానిపనులుచేతురేజనులెల్ల

బుధ్ధినొసగుమయ్యభుజగశయన

3 వానలోనతడిసె వానరాలనుచును

వంతపొందనేలచింతపడగ

కర్మఫలమువలన కలుగవా యిక్కట్లు

ధాతకైనకర్మఫలము తప్పదోయి

పాపచింత

1పాపియనుచు నీవు పలవింప ఫలమేమి?

భీజమనుసరించి భూజముండు

భావసిధ్ధి వలన భాగ్యంబులబ్బురా

పాపచింత వీడి బ్రదుకు మోయి

2 ఉత్త"ముండ"ననుచు " పాత"కుండ"ననుచు

భాషణంబులీయ భావ్యమగునె

ఆత్మతత్త్వమెరిగి యానంద మందుటె

మనుజ ధర్మమనుచు మరువకోయి

1హస్తలాఘవంబునవలీల చూపించి

బూదిచేతబట్ట మురిసిపోవు 

వెర్రిబాగులాళ్ళు వేలాది కలరయ్య

మహిమయేమిలేదు మాయదప్ప

లోకరీతి

ఆర్జనంబుగల్గ యభిమానముల్ మెండు

పంటచేలు విరగబండినట్లు

ధనములేనినాడు దరిజేరరెవ్వరు

నాగరాజు మాట నమ్ముమోయి

2 వాలమున్న వాడె వాల్మీకి యన్నట్టి

వానితోడవాదమేలనీకు

బుద్ధిలేని నరుని శుధ్ధిచేతుననచు

పూనకంబు నీవు పూననేల?

భజగోవింద శ్లోక భావానువాదము

మరల మరల పుట్టి మరలమరలగిట్టి 

జనని కడుపు నందు జన్మమెత్తు

సారహీనమైన సంసారజలధిలో 

మునగనీకుమయ్య భుజగశయన

(నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకే యమృత్త్వ మానసుః)  శ్లోకభావాను వాదము

పుణ్యకర్మచేత పుత్రలభ్ధివలన

భూరిధనముచేత ముక్తి రాదు

త్యాగగరిమచేత తథ్యంబు సమకూరు

అమృతమయత మీకు నార్యులార!

(ఉగ్రవాదము)

వెర్రికుదిరె నింక వేవేగ రోకలి

తలకుచుట్టుడనుచు తలుచుకుంక

మతముపేర వీడు మారణహోమంబు

సల్పుచుండు నితడుసమయమెరిగి

ఉగ్గుపాలతోడ యుగ్రవాదంబును

బోధసేయ దగునె బోధ్ధలార!

మరచినారుమీరు మానవత్వంబును

సర్వజనుల హితమె సమ్మతము

మమతసమతనేర్పు మతమెసమ్మతమౌను

మమత నేర్పనట్టి మతముమతమే

సర్వజనుల హితమె సమ్మతము

జనులసేవ చేయు జన్మము ధన్యమ్ము

జీవసేవ చేయశివుడు మెచ్చు

జాతి జనులు మెచ్చు చక్కటి మార్గమ్ము

నాగరాజు మాట నమ్ము మింక

కూడియుండవలయు కూర్మితో మీరెల్ల

పరులమనసునెరుగ భధ్రమగును

కన్న వారినెపుడు కష్ట పెట్టవలదు

నాగరాజుమాట నమ్మడింక

మహినిలేనెలేదుమహిమాన్వితంబైన

పుణ్యభూమిలేదు పుడమిలోన

కాశి క్షేత్ర వాసం కాంక్షకంటెకలదె

అమృతఫలము మీకునార్యులార!

ఎండమావి వెన్క యెందుకో పరుగులు

ఉర్వినుండుదాక నుండగలమె

కలిగియున్నదాని కల్పవృక్షమనుచు

తలచవలయునీవు తత్త్వమరసి

మబ్బుతెరను బోలు మాయతెరనుద్రుంచి

ప్రణవమందు బుధ్ధి పదిలపరచి

ఆత్మలోన యోగి యానందమూర్తిని

చూడగలడు మనకు చూపగలడు

మాయగాళ్ళకిలను బహుమంచికాలము

నీతివంతుడేమొ నిందపడును

కష్టజీవిబ్రదుకు కన్నీరు మున్నీరు

ధాతనిర్ణయంబు దారుణంబు

మెరపు మెరసినట్లు మిరమిట్లుగొలుపగా

కొద్దికాలమున్న కొరత లేదు

మలగిపోవునట్టి మసిబారుదీపాలు

ఎంతకాలమున్న నేమిఫలము

పుణ్యకర్మలెల్ల పుత్తడిగొలుసులు

ఇడుములొసగు కర్మ యినుపగొలుసు

బంధనాలు దెచ్చుబహుకర్మ లేలరా!

మోక్షపదము మరువ మోసమొచ్చు

సుఖము నిచ్చుసఖుడు దుఃఖమొసగువైరి

తనకుతానె యగును తథ్యమింతె

మిత్రుడితడు నాకుశత్రుడతడనుచు

భ్రమలమునిగి నరులు బ్రతుక నేల

అన్ని తెలిసినట్టి యఖిలాంత రాత్ముడు

కదలడేమి వాడు మెదల.డేమి?

అడుగవలయు వానియాంతర్యమేమని

మాయసేయునట్టి మాయగాడు

మధురమంజులమ్ము భాగవతమహిమమ్ము

తెలుగువారి ఘనత తెలుపు నోయి

6 పోత పోసినట్టి  పసిడియౌ పోతన్న

శైలికిలను యేది సాటి వచ్చు

పదము పదములోన పారవశ్యమెగాని

మరియుమాటలేదు మహిని సుమ్ము

7సోమనాథు శైలి సోయగాల నెలత

పాలకురికి తెనుగు పాయసమ్ము

ద్విపద పద్యమందు ద్విగుణితానందమ్ము

వీరశైవ మతపు విశ్వమయత

///////

హితౌక్తులు

మొండి బండతనము ముక్కుసూటియనుచు

మొరకు పలుకు పలుక మోసమొచ్చు

మంచితనముతోడ మనసుగెలువ వచ్చు

నాగరాజుమాట నమ్ముమింక

సిగ్గులేని బావ చెప్పుచుంటిహితము

కోపగించుకొన్న కొంపమునుగు

ఆచిచూచి పలుక యానంద మొలకించు

చెవుల విందు చేసి క్షేమమిచ్చు

3ఉన్నమాట పలుక నులికేలనోతల్లి

నిజము పల్కితంచు నింద వలదు

కల్లపలుకు లెల్ల కలవారి విద్యలు

బీదవాని పల్కు పిడుగుపాటు

నీదు బిడ్డ నీకు నీలంపు రత్నమ్ము

పరుల బిడ్డలెల్ల బండరాళ్ళె

కడుపు తీపి పలుకు కాలమే తీర్చును

తొట్రుపాటు పడగ తొందరేల

పడవ నీటిలోన పయనించునట్లుగా

నరుడు జగతిలోన నడువ దగును

నీరు పడవలోన నిలువరానియటుల

వర్తనంబు చేయ భద్రమిచ్చు

ఆమని ఆగమనం౧౧౧౧౧౧

1మధువులొల్కనట్టిమధుమాసమరుదెంచె

స్వాగతించరండి సాదరాన

రమ్ము రమ్మటంచు రాజిల్క పల్కగా

పికము కూడ నిన్ను పిలువ సాగె

2

చైత్రమాస మిచ్చు చైతన్య దీప్తితో

సాగవలయు నీవు సాదరాన

ఆరురుచులతోడనాత్మీయభావమ్ము

సమత మమత నేర్పు చక్కగాను

3 ఆంగ్లవత్సరాది యర్ధరాత్రియతిధి

తాగివాగి తూగి తరలిపోవు

మత్తుదిగిన వెన్క మతిబోవు మనకెల్ల

అనుకరించ బోకు తెనుగు వీర!

మంత్రశక్తిలేదు తంత్రశాస్త్రమెరుగ

తపముచేయలేను జపమురాదు

అర్చనంబు చేయ యసలేమి రాదమ్మ

అమ్మయనుచు పిల్తు యార్తితోడ

ద్విజుల మంచుమీరు తీండ్రీంచగానేల

స్నాన సంధ్యత పము జపము విడిచి

శమము దమములేక శాఠ్యంబు చూపించు

బూకరించ దగునె.బుగులు తోడ

ధ్యాన యోగం మిచ్చు జ్ఞాన యోగమెపుడు

బుధ్ధి బలముతోడ సిద్ధి కలుగు

శాస్త్రవేత్తలెల్ల శాస్త్రీయ బలముతో 

తేల్చి చెప్పినారు తెలుసుకొను

బధ్ధ కమ్మ మనకు పరమశత్రవువన్న

నిజము తెలిసి మసల విజయమొచ్చు

ఉద్యమమ్ము మనకు నూపిరై నుండగా

గెలిచి తీరగలము విలయమైన

గుణము వున్నచాలు కులముతోపనియేల

కవిత కన్యకోరు కావ్యకళను

చొప్పదంటు కవిత చొచ్చోలకర్హంంబు

మంచికవిత యెక్కు మస్తకంబు

అమంత్రం అక్షరం నాస్తి 

నాస్తిమూలమౌషధం

అయోగ్యో పురుషోనాస్తి

యోజకః తత్రదుర్లభః

(ఆంధ్రాను వాదము)

మంత్రమే కాని యక్కరమవనిలేదు

ఔషధంబుకానిదినుసు నవనిలేదు

వ్యర్థు డైనట్టి పురుషుండువసుధ లేదు

ఎట్లు వాడవ వలయునో యెరుక కెరుక

మతము మారబోకు మందమతివికాకు

పాపివనుచు నిన్ను పలుకరింత్రు

దీనజనుడవనుచు దీర్ఘాలు తీతురు

ఏడ్పుతప్ప దోయి యిలను నీకు


అమ్మ కరుణ కల్గ విలువ గలగు వలువ విలువపెంచుసభల

పాడిమెదవు లున్న పండు సిరులు

దారి గెలుచు నతడు నరదమున్నయతడు

శీల సంపదున్న శ్రీని పొందు.లభియించు

కొరత యింతలేక కోర్కె తీరు

అమ్మ చరణ సేవ నమృతత్వ సిధ్ధియె

కలియుగుములోన కల్ప తరువు

గతము పైని చింత గరళమ్ము వంటిది

భవిత మీది చింత భ్రమల ముంచు

వర్తమాన మందు వర్ధిష్ణువగుదువు

నాగరాజు పలుకు నాణ్య మోయి

పగటివేషమేయ పరమేశ్వరుండౌనె

డమరుకంబు పట్టి డగిడివౌతి

శూలరోగమున్న శూలివౌతివకట

నాకలోకమేడ నక్కయేడ

ఓడి తనెడి మాట యోర్పుతో దూరమ్ము

పెట్ట వలయు మదిని పెద్ద బుధ్ధి

గెలువ లక్ష్య మొకటె నిలుపవలయునీవు

విజయ మర్మ మిదియె విహిత మిదియె

దృష్ట్వారణ్యే మహా వ్యాఘ్రం 

భీతో హారతి మానవః

అమంత్రం అర్చకం దృష్ట్వా తథాభీతో జనార్దనం

వనములోన తిరుగు వ్యాఘ్రంబు కాంచగా

నరుడు భీతి చెంది పరుగు తీయు

మంత్రమొరుగనట్టి మూడార్ఛకునిగాంచి

భయము చెందునోయి మాధవుండు

దొంగ గురువు లయ్య దోచుకొనగవచ్చి

ఉన్నదంత వారుయూడ్చి నారు

నమ్మరాదు వీరి నయవంచనమ్మల

గుడ్డిగాన నమ్మ గుండె చెరువె

తిండి తిప్పలొకటె తీర్చుసుఖమొకటె 

భయమునిద్రయెకటె బ్రతుకునందు

బుధ్ధిబలమువలన పురుషుండు ఘనుడయ్యె

మతియులేనివాడు మృగము కాడె

కులము కులమటంచు కుళ్ళేవు కుళ్ళేవు

మతమమతమతంచు మాటలేల

కులము లేనితావు కువలయంబుననీవు

చూపగలవె నీవు చోద్యమమర

కాశిలోన జీవి కనుమూయి పుణ్యంబు

విశ్వ నాథు లీల వింత యిదియె

రామ మంత్రమూదు రాకేందు ధరుడంత

కనులు మూయువాని కర్ణమందు

తాడి దన్ను వాని తలదన్నువాడుండు

మోసగింప బూన మోసమొచ్చు

ఎత్తు నీవు యెత్త పైనెత్తి మొత్తును

తెలివి మీర కెపుడు తెగులు మిగులు

కాశికాశియనుచు కాసంత పిలిచినా

విశ్వనాథుడంత వినును మాట

ఆసుతోషుడతడు నానంద వనమున

వేచియుండునతడు వేడ్కతోడ

తలయు తోక లేని తలతిక్క వాదంబు

తలనుదాల్చి వారు తామ సించి

ద్రవిడ రావణుండు తమకు తమ్ముడనుచు

పలుకు చుండ్రు వారు భ్రాంతి తోడ

ఇమంచివారితోడ మైత్రిసేయవలయు

దుష్టజనుల పొందు దుఃఖమొసగు

రామచంద్రు మైత్రి తోడరాజ పదవి

అలవిభీషనుండు నందుకొనియె

విభవమందున నైన విపదలోనైనను

మంచి వారు యేక మార్గరతులు

ఆరుణవర్ణ ముండునరుణోదయంబున

అస్తమించువేళ యట్లెయుండు

ఇలాలనంబు వలన లౌల్యంబు మప్పును

దండనమ్ము చేత దక్షతొదువు

గురువు హస్త మెపుడు కురిపించు నమృతమ్ము

గురువు మదిని విసము కురియ దెపుడు“ లాలనాత్ బహవో దోషాః తాడనాత్ బహవో గుణాః 

తస్మా త్పుత్రంచ శిష్యం చ తాడయే న్నతు లాలయేత్”

                చాణక్యుని సూక్తి

మహమ్మద్ రఫీ స్మృతికి సమర్పిస్తు౼౼

అతనిగాత్రమందు నమరత్వమున్నదో

ఆలపించగానె హాయినిచ్చు

మధువుచేతగాదె మాహేశలింగంబు

పూజచేసెనేమొ పూర్వ మందు

దొంగ గురువు లయ్య దోచుకొనగవచ్చి

ఉన్నదంత వారుయూడ్చి నారు

నమ్మరాదు వీరి నయవంచనమ్మల

గుడ్డిగాన నమ్మ గుండె చెరువె

భక్తవరులకిచ్చు పరవశానందమ్ము

భక్తిసుమములెల్ల భవునకిచ్చి

రసికజనుల మనసు రాగరంజితమ్ము

గానమహిమచేత కలుగజేయు


"భోజనాత్ పూర్వభాగేచ భోజనాత్ పరుస్తోంది

క్షణే క్షణే మతిర్భిన్నా ధర్మస్య త్వరితంగా గతిః

తినక ముందు బుధ్ధి తిన్నాక వుండునా

చిటికెలోన మారు చిత్తమెపుడు

ధర్మమాచరించు తక్షణంబుననీవు

పెద్ద లన్న మాట సద్దిమూట

తగని వాని కెపుడు తగినది దక్కినా

ఫలము నంద దెపుడు ప్రాప్తి లేక

అమృత పాన మంది హతుడాయె రాహువు

తలను కోలుపోయె తనువునుండి


కావ్యశాస్త్ర వినోదేన కాలోగఛ్ఛతి ధీమతాం

వ్యసనేనచ మూర్ఖాణాం నిద్రయా  కలహేనవా"

అనువాదము:--

కావ్యశాస్త్ర చర్చ కాలంబు గడపగా 

బుధ్ధిమంతుడెపుడు పూనుకొనును

తాగివాగుటందు తగవునిదురలందు

మూర్ఖ నరుడు ప్రోద్దు బుచ్చు

తగిన వాని కెపుడు తగనిది ప్రాప్తించ

భాగ్య శాలియగును ప్రాప్తిచేత

కాలకూట విషము గ్రక్కున మ్రింగినా

హారమట్లు యమరె హరునకంత


అమ్మ కరుణ చేత నఖిలంబు సమకూరె

కొరతలేమిలేని కౌశలంబు

యోగ విద్య నొసగి యోగీశ్వరులజేసె

వల్లెలాంబ తల్లి వరము నొసగె

బాలవాక్యమైన పాటించ దగునోయి

యుక్తి యుక్తమైన సూక్తిరీతి

వృధ్ధు డాడినట్టి బుధ్ధిలేనిపలకు

వినగరాదుమనము విషపురీతి

పాలు పోసి పెనుప పామేమి మారును

వృధ్ధి చెందునోయి విషము మరియు

మంచి మాటలాడ మరియింతకోపించు

మదమురేగినట్టి మత్సరుండు


పితా ధర్మః పితా స్వర్గం

పితాహి పరమం తపః

పితా ప్రీతి మాపన్నె

సర్వా ప్రియన్తి

(అనువాదము)

ధర్మమూర్తులనగ తల్లిదండ్రులెపుడు

వారి సేవ తపము వాస్తవమ్ము

అమ్మనాన్నలంత యానంద ముందుగా

అమరలోక మంత హర్ష మందు

" లోభావిష్టో నరో విత్తం 

వీక్షతే నైవ చాపదమ్ 

దుగ్ధం పశ్యతి మార్జాలో

యథా న లగుడాహతిమ్".


పాలుకోరు పిల్లి బడితదెబ్బలపైని

దృష్టి నిలుప డకట సృష్టి లోన

ధనము కోరు నరుడు తానెంరగడటుల

బాధ లొచ్చు ననుచు భావియందు


పిల్లి దృష్టి అంతా పాలమీదే  కాని  తరవాత తగిలే కఱ్ఱదెబ్బల మీద ఉండనట్లు -  దూరాశతో నిండిన వాడికి డబ్బే కనిపిస్తుంది కాని తరువాత వచ్చే ఆపద కనబడదు !


బాధగురువులెల్ల భవబంధ మోక్షంబు

కలిగజేతుమనుచు కల్ల పలుకు

పటిక బెల్లమట్లు పలుకగలరువారు

నమ్మదగరువారు నయము గాను

లాలనంబు వలన లౌల్యంబు మప్పును

దండనమ్ము చేత దక్షతొదువు

గురువు హస్త మెపుడు కురిపించు నమృతమ్ము

గురువు మదిని విసము కురియ దెపుడు“ లాలనాత్ బహవో దోషాః తాడనాత్ బహవో గుణాః 

తస్మా త్పుత్రంచ శిష్యం చ తాడయే న్నతు లాలయేత్”

                చాణక్యుని సూక్తి


అనాయాసేన మరణం

వినా దైన్యేన జీవనం

దేహాంతే తవ సాన్నిధ్యం

దేహిమే పరమేశ్వరా!

అనువాదము:--

హీనమైన చావు దీనమైన బ్రతుకు

వలదు వలదు నాకు వసుధలోన

మరణమందనపుడు మాధవుచరణమ్ము

జ్ఞప్తినొసగ నట్టి జ్ఞాన మివ్వు

వేసి నట్టి యడుగు వెనుకేయరాదోయి

తెలివి చూపవచ్చు గెలిచి నీవు

మంచి యెత్తు నీకు మదిలోని తోచిన

ఆడిచూపుమోయి యాటలోన

చేఅమ్మ కరుణ కల్గ నఖిలంబు.లభియించు

కొరత యింతలేక కోర్కె తీరు

అమ్మ చరణ సేవ నమృతత్వ సిధ్ధియె

కలియుగుములోన కల్ప తరువు


కినుక పూనరాదు గికురించతగదోయి

మోసగింపరాదు మాయ బూని

కల్ప కాల ముండు ఖలునకు నరకమ్ము

గురువు వంచనమ్ము కూడదెపుడు


పద్మదళము బోలు పెదవి కుదువ బెట్టి పదవిసాధించగా

దలచు టెల్ల కాదె ధనము కొరకు

పదవి కుదువ బెట్టి పెదవిపొందునతడు

వెధవ లందు పెద్ద వెధవయగును కనపట్టు

పరిమళించి నట్లు పలుకులుండు

కర్కశంపు మనసు కర్కటీ తుల్యము

ఆతతాయి వినయ మభిన యించు

దొంగ గురువుచేత దొరుకునా మోక్షంబు

మాయలోడు ముంచు మత్తునందు

తత్త్వబోధ పేర ధనముదోచునెపుడు

మాటవినిననీకు.మట్టీ మిగులు

విషము మ్రింగ రాదు విద్వాంసులెవరైన

పాముతోడ యాట పనికి రాదు

యోగి జనుల నింద రోగంబు తెచ్చును

ద్విజుల నిందజేయ దీనుడగును

తండ్రి శిక్ష చేతతనయుండు దక్షుడై 

మంచి పేరు పొందు మహిని సుమ్ము

గురువు వలనకాదె కుశలులై శిష్యులు 

వాసికెక్క గలరు వసుధలోనఅత్యాసన్నా వినాశాయ

దూరస్థా న ఫలప్రదా

సేవ్యతా మధ్యభాగేన

రాజా వహ్నిః గురు స్త్రియః

(అనువాదము:--

చెంతనున్న చెడుపుసేయగలవు

దూరమున్న పనులు దుష్కరమ్ము

మధ్యనున్న మనకు మర్యాద దిక్కును

ప్రభువు గురువు

 అలుకపూననేల అనురాగ మూర్తివి

తల్లివీవు కావె తనయుగావ

అమృతమూర్తివీవు ఆనందమొసగగా

భువికి వచ్చినావు అఘములనెల్లను హరియించు శత్రుల

శమియించు శమివృక్ష శక్తివలన

ధనువుధరియించు ధనుంజయునకును

విజయమొసగునట్టి విజయదశమి నొసగ ప్రమద వలనమనసుమొచ్ఛు పలుకు మధురమై వినపించు

ప్రాణులోకమెల్ల.పరవ సించు

పలుకమోయి నీవు పటికబెల్లమటుల

పలుకుబీదతనము 

కొంప గోడలున్న కోటిరూప్యములున్న

విలువగలుగు నట్టి వలువలున్న

శీల మొకటి రక్ష శీలవతికెపుడు

సాధ్వి రక్ష చేయు

నాగు పాము మేలు నయవంచకునుకన్న

కాల మెరిగి పాము కాటు.వేయు

నీచు డెపుడు ముంచు నిన్ననవరతము

జాగరూక డగుటె చాల వలయు

 తండ్రి ఘనత చేత తనయుండుఘనుడైన

అట్టి కొడుకు జన్మ యధమ మగును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత