చిన్మయి లింగమ్ము

శ్రీశైల నాథుండు చిన్మయ లింగమై 
భక్తాళి నెల్లను బ్రోచు నెపుడు
శ్రీశైల శిఖరాన్ని శీఘ్రంబు గాజూచు
భక్తాళి కెల్లను ముక్తి దొరకు
పాతాళగంగయే పావనత్వంబివ్వ
అఘరాశియంతయు నంతమగును
ఇష్ట కామేశ్వరీ యిష్టార్థ మందివ్వ
మానుష జన్మంబు భద్ర మగును
ఆ.వే.భక్త సులభుడతడు భవబంధములనెల్ల
భస్మ రాశిచేయ భద్రమూర్తి
మనసుతోడ నిచ్చు మారేడు పత్రైన
ముదము మీర గొనియు  మురిసి పోవు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత