కైవల్యనీలయమూఊ

కైలాస శైలంబు కైవల్య నిలయమై
ప్రణవస్వరూపమై పరవసించె
బ్రహ్మాది దేవతల్ పరమార్థ తత్త్వంబు 
పరమేశు నడుగగా తరలినారు
మునివంద్య పూజ్యుడౌ ముక్కంటి సేవింప
మునిబృందమంత మూగినారు
దాక్షిణ్య మతితోడ ధక్షిణా మూర్తియై
జ్ఞానామృతంబంత గరిపె నిట్లు
బ్రహ్మమొకటె నిజము బ్రాహ్మాండ మంతయు
పరిణామ శీలంబు పరిగణింప
స్వప్న జగతి యంత సర్వంబు మాయమౌ
కనుల తెరవ గానె కరిగి నటుల
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత