మాతృభాష

తల్లి గర్భమునుండి తనయుండు నేర్చిన
మాతృభాషనెపుడు మరువదగునె
అమ్మకడుపులోనెనాభిమన్యుండు
తమ్మిమెగ్గయయొడుపుతాను నేర్చె
అష్టాక్షరీమంత్రమభ్యసించెనుకాదె
కనకకశిపుసుతు కథలు వినమె
పరభాష పదముల పరిచయమయినంత
పండితుండగుమాట ప్రల్లదనము
ఆ.వె.తల్లినోచనట్టి తనయుండు పినతల్లి
ఎట్లు నోచుననచు యెరుక లేదె
వెర్రి మోజునొదిలి వేల్పుతల్లిపలుకు
అమ్మ భాష కన్న యమృత మేది?
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత