ఆది దంపతులు
అవతరింతురెపుడు నమ్మనాన్నలరీతి
ఆమని రీతిగా యవిని పైన
అవతార మెన్నని యనుకొన రెప్పడు
ఆప్యాయ మేహద్దు యెప్పుడైన
దారిత ప్పినసుతు దండించు రీతిగా
రక్కసి మూకల రట్టుపెట్ట
ధర్మంబు నెలకొల్పి ధరణినికాపాడ
ఇలకువచ్చినయట్టి వెల్పురేడ
కమలాప్త ! కరుణించి కాపాడ మనుచున్న
భక్తాళి కెప్పుడు భద్ర మివ్వ
ఆ.వే పరుగు పరుగు నంత పరుగెత్తి వత్తువు
అమ్మ మనసు వోలె నార్ద్ర మయ్య
తల్లి దండ్రు లట్లు తడయక రక్షింప
కొరత లేదు మాకు కొంచ మైన
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి