మధుమాసం --మమతాను రాగాలు

మధుమాస మనిపేరు మండు టెండలజోరు
మరుమల్లె తావియె మదికి హాయి
వడగాలిహోరులూ వడగళ్ళవానలు
అన్నదమ్ములవోలె నాడుకొనును
కొత్తావకాయతో క్రొంగొత్త రుచులోయి
ఆరుబయటినిద్రనాదమరుపు
మామిడి పండ్లతో మనసంత నిండగా
చూతఫలము వైపు చూపునిలుచు
తాటి ముంజె లెల్ల తాపంబు తీర్చు
మట్టికుండనీరు మదికి హాయి
ఛత్ర పతివి నీవు ఛత్రంబులేకుండ
అడుగు పెట్ట వసలు ఆరు బయట
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత