బోనాలు

సకలజీవులనెల్ల సాకుచుందువునీవు
కన్నతల్లియటుల కరుణతోడ
నిఖిలలోకజనని నిన్నుసాకుటయన
పగటికలలుకూడ ఫక్కుమనను
బోనాలుయెత్తుటో బోర్లగింతలు తప్ప
మాకేమి రావంచు నమ్మవమ్మ
నిండైన భక్తియే నీకిచ్చు బోనమ్ము
నిమ్మపండ్ల సరమె నివ్వగలము
ఆ.వె.జంతు జాతిపైన జాలిచూపుడనుచు
నచ్చచెప్పవమ్మ నరుల కెల్ల
ప్రకృతి కూడ యిపుడు పరవసించునుగాదె
వినతి జేతునేను వినయ మెప్పు
(రచన:-- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత