యుగములెన్నో గడిచె
యుగములెన్నొగడిచె జగతిగతియుమారె
మానుష ధర్మంబు మారలేదు
విపినవాసమనుచు విసుగుపడని యట్టి
తనయుగనినయట్టీ ధర్మ భూమి
వాగర్థముల రీతి వసుధలో వసియించు
పతిపత్నలున్నట్టి భాగ్యసీమ
అన్నయె ముఖ్యంబు నాకంచు భావించు
భాతృభక్తులు గల భరతభూమి
శత్రువైన నేమి శరణుజొచ్చెననచు
క్షమియించు నట్టి
క్షాత్ర భూమి
రాముడేలినట్టి రామరాజ్యమిదియె
కాంచినాము మేము కన్నులార
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి