కనికట్టు కాని కథ
కట్టుకథయనుఛు కల్పనంబనుచును
రెట్టమతపువెధవ.రెచ్చిపోవు
నాస (NASA)సంస్థతెలుప నాసికంబెగబీల్చి
నమ్మునతడుకాదె నాపవెధవ
అమ్మనాన్నలమాట నసలునమ్మననచు
పొరుగువారినెపుడు పొగడువెధవ
రామకథకుసాటి రామకథయెభువిని
ఇంతకన్ననులేదు నిహముపరము
ఆ.వే.రాజు యనిన నింక రాముడే రాజౌను
తల్లియనిన సీత తల్లి తల్లి
దాసుడనగ రామ దాసుడే దాసుండు
రాజ్యమనగ రామ రాజ్య మొకటె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి