నయవంచకులు

నీలాంటి వారంత నిలలోన కలరయ్య
నయవంచనంబున నటులు వీరు
తిమ్మిని బమ్మిగా బమ్మినితిమ్మిగా 
చేయగలగినట్టి చెనటు లోయి
ఆకాశ హర్మ్యాలు నందమౌ రీతిగా.
కట్టగలుగునట్టి దిట్టలోయి
అరచేత వైకుంఠ మవలీల చూపించు
కనుకట్టు విద్యలో గడుసు లోయి
మాయదారి విద్య మర్మంబు నెరిగున్న
గడుసు వారి యందు ఘనులు వీరు
మేక వన్నె పులికి మేలైన చుట్టాలు
నక్క జిత్తు లున్న నటులు వీరు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత