మహమ్మద్ రఫీ అమృత గానము

అతనిగళములోన యమృతాభ్దియంతయు
దాగెననుమాటయె తథ్యమోయి
గానగంధర్వుడంత గగనసీమవదిలి 
ఇలకువచ్చెననచు యిపుడు తెలిసె
ఆలాపనంబంత యమృతాభ్దిలోనంత
ఎన్నిమునకలేయ వెగటురాదు
విన్నకొలదియింక వీనులకెల్లను
విందుజేయననుట వింత కాదు
ఆ.వే.కవుల రచన లెల్ల కావ్యరచనలట్లు
అమర గాయ కుండు నవని కొసగె
వినయ మూర్తి మోము విజయదరహసంబు
వెలుగులీనుచుండు వెన్నలట్లు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
నా అభిమాన గాయకుడు మహమ్మద్ రఫికీ అక్షరాభినందన మందారము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత