కాశీనగరము
కాశికా నగరాన గంగమ్మ వడిలోన
కొనసొగె పయనమ్ము కోర్కె తీర
తల్లిగర్భమునందు తనయుండు గడిపిన
నవమాస వ్రతమంత నడిపి నట్లు
శివునితలుపు లేక చీమైన కదలదు
అభవుతలుపులేక నమరు నెట్లు
కనికరించమనుచు కాలభైరవుని వేడ
కరుణార్ద్రదృష్టితో కనికరించు
ఆ.వే.అన్న పూర్ణ తల్లి నాదరించుమనల
కొరత లేక యిట్లు కోర్కె దీర్చు
పెద్ద కనులతల్లి ప్రేమతో దీవించు
జ్గాన మొసగు మనకు కచ్చితమ్ము
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి