అమ్మ

అవనిలో నెవరయ్య నమ్మకన్న ఘనులు
అనురాగ మూర్తియై యాదరింప
మాతృదేవోభవ మంత్రరాజముకన్న
మహనీయమంత్రమ్ము మహిని కలదె
చైతన్యమనునట్టి స్తన్యంబు నిచ్చేటి
అమ్మకన్నయెవరు నాప్తులయ్య
ఆఅలు నేర్పించునాదిగురువెపుడు
జననికాదెమనకు జగతిలోన
వినయమ్ము ధైర్యమ్ము విజ్ఞతా స్పూర్తి యు
ఇలలోన తల్లియె నిచ్చునోయి
ఆ.వె‌.బడులు సరియె తల్లివడికన్నను
రామకృష్ణు లెల్ల రాణుకెక్కు
అసలు కారణంబు నమ్మనడుగుమోయి
నాగరాజు మాట నమ్ముమింక
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత