ఉపాధ్యాయవృతిలో నా అనుభూతి

ముప్పది మూడు వసంతాలు తెలుగు అధ్యాపక వృత్తిలో నా విద్యార్థులందరూ చక్కని ప్రతిభ కనబరిచి ఓటమెరుగుండ 100/శాతం ఉత్తీర్ణత సాధించారు.అన్ని సబ్జెక్టులో కన్నా ఎక్కువ మార్కులు (,గుణములంటారు,ఆ అనువాదం నాకు అస్సలు నచ్చలేదు) సాధించడం మాతృభాష గొప్పదనం.కానీ కొందరు తల్లిదండ్రులు కానీ తోటి ఉపాధ్యాయవర్గం వారి మనసులో ఒక దురభిప్రాయం బలంగా నాటుకు పోయింది.తెలుగుసబ్జక్టును చదవనక్కర లేకుండానే పాస్ కావచ్చని.ఇది తర్కసహమైన అభిప్రాయం కాదు.కానీ వారికా అభిప్రాయం మూఢనమ్మకం లా స్థిర పడింది.అన్ని భాషలకన్న తెలుగు భాషె క్లిష్టమైనది.వ్యాకరణరీత్యా.కానీ మాతృ భాష కారణంగా విద్యార్థులకు తమభావ వ్యక్తీకరణ సులభసాధ్యమైంది.ఏది ఏమైనా నా అధ్యాపకత్వం విజయవంతంగా పుర్తైనది.
కాని ఇంకా తెలుగు భాషా బోధనపై ఆసక్తి వుంది.విద్యార్థులకు సూచన మాతృభాషలో  నైపుణ్యం సాధించిన వానికి మిగిలిన భాషలు కొట్టిన పిండి.
సంతోషించదగ్గ విషయమేమంటే  నావద్ద తెలుగు నేర్చుకొన్న విద్యార్థులు అన్యభాషా రాష్ట్రాల వారున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ,తమిళనాడు వారు కూడా! వారు కూడా తమ మాతృభాషతో సమానంగా తెలుగు లో నైపుణ్యం సాధించడం నాకు గర్వకారణం. నాకే కాదు ఏ ఉపాధ్యాయునకైనా ఇది గర్వకారణమే

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత