ఛీఛీ నేతలు
ఛీచీలు మనకేమి చిక్కింది చాలంచు
చిరుదర హాసమ్ము చిందులాడ
కారాగృహమ్మంత కళ్యాణ సదనమ్ము
వసుధలో లేదంచు వాదమాడు
నాపసన్నాసియె నాయకుడంచును
జేజేలు పలికెడు చెడిపె లుండ
అధికార పదవియె నంతింబనుచున్న
పలువలె నేడింక పాలకు లైన
పాడౌను దేశమ్ము పతనమే ఫలితమ్ము
పేదల బ్రతుకుల పెనుతు ఫాను
ఆ.వే.వ్యక్తి పూజ చేయ వరుసతప్పనునేత
పదవికొరకు తాను పాటు పడును
ఇట్టి నేత చేత యిడుములే యిడములు
మంచి చేయడతడు మచ్చుకైన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి