విమతస్తుల కుయుక్తులు

విమతస్తుల కుయుక్తులు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
నటరాజువేషాన నర్తనంబాడగా
ఏసుకెక్కడకుదురు యెక్కడైన
శిలువనెక్కునుగానిశూలంబుతిప్పునె
తాండవంబాడగా త్రాణ లేదు
దిక్కులే వస్త్రాలులు దిగంబర మూర్తివి
దుస్తులే లేకుండ క్రీస్తుడెట్లు
భస్మాంగ ధారియై భవరోగ వైద్యుడై 
మూడుకనులతోడి మురియుశివుడు
ఆ.వే.కాలకూటవిషము కంఠాన దాచిన
అమృతమొసగునట్టి నభవుడతడు
అట్టివాని పోల్కి నవసరంబెట్లాయె
తలచి చూడతరమె తత్త్వమయుని

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత