కలలోన--జగదంబ

కలలోన జగదంబ కనిపించ గానంత
ఆత్మలో ఆనంద మంకురించు
ఇలలోన పరమేశు నిసుమంత తలచినా
పూర్వకర్మఫలము బూడిదగును
నీధర్మమిసుమంత నిర్వాహమొనరింప
బరువైన భయమంత మాయమగును
నిష్కామ కర్మయే నిరపాయమైనట్టి
మరుజన్మ లేనట్టి మంచిదారి
ఆత్మలోన నున్న ఆనందమూర్తిని
జ్ఞాన గమ్యుడనుచు జ్ఞాత మగును
బాధగురువు నొదిలి బోధగురువుచేరి
తత్త్వ మొరుగ వలయు.తప్ప కుండ
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత