వానరమ
మకుటమ్ము లేనట్టి మారాజు నీవయ్య
గాంభీర్య మెప్పగా గద్ధె చిక్కె
ఏరాజు కున్నది యీపాటి విభవమ్ము
రాజులే లేనట్టి రాజ్య మాయె
నరులబ్రతుకులందు నాణ్యమేదనియంచు
చింతింతు వేలనొ చిత్త మందు
వానరలలో నున్న వాత్సల్య భావమ్ము
నరులలో లేదంచు నలగబోకు
ఆ.వె.రామ రాజ్య మింక రావలయుననచు
నీదు తలపు యింక నిజమె యగును
కోత లెపుడు చాల కోయునరులకన్న
కోతి మేలుకాదె కోటి రెట్లు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి