నరజన్మ దుర్లభం
మహనీయమైనట్టి మానవ జన్మంబు
చరితార్థమౌరీతి సాగవలయు
కోట్లాది జన్మలకొసలోనమనకిట్టి
నరజన్మలభియించె ధరణిలోన
శ్రేయస్సు కొరకు పై స్థిరచిత్త మౌరీతి
ఆధ్యాత్మమార్గమ్ము నందుకొమ్ము
తనలోననఖిలభూతములందు నొకరీతి
సాహితీ బుధ్ధితో సాగవలయు
ఆ.వె.మనుజ జన్మమంది మాధవు పొందక
పనికి మాలిన ట్టి పనులతోడ
ప్రొద్దుబుచ్చు నరుడు పుట్టును మరుజన్మ
ఎన్ని జన్మలైన యెరుక లేక
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి