శ్రీనగరము

శిఖరాయమానమౌ శ్రీనగరమెపుడైన
భరత మాతశిగను మరకతమ్ము
కాశ్మీర రాజ్యమ్ము కనకకీరిటమౌను
విభజించి పాలించు విపరీత బుధ్ధితో
కాశ్మీర సమస్య కల్ప నాయె
తెల్లదొరలతోడ నల్లదొరలుకూడ
ఆగ్నికాజ్యంబును నంద జేయ
ఉగ్రవాదులకది నూత మాయెనకట
పొరుగువారంతను పొగను పెట్ట 
నిత్యమారణహోమనియతిగా మారగ 
మంచి చర్య నొకటి భారత దేశమ్ము
జాగు చేయకుండ చర్య గొనియె
గృహపు రాజ్య మంత్రి కూర్మతో 
కొలికి తెచ్చె నిపుడు కోర్కె మీర
(విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత