వైనతేయు రథము

వైనతేయురథము వైష్ణవ తేజంబు
విమతుల మర్దించువిష్ణు శక్తి
చక్రంబు చేబూని శత్రుల నిర్జించు
శరణన్న వానికి శరణమొసగు
శార్ఞంబు ధరియించి శస్త్రాస్త్ర ధారియై
అసురుల నిర్జించి హర్ష మొందు
కౌమోద కంబును కౌతూహలంబొప్ప
పూరించు తానంత పూర్ణ రీతి
ఆ.వే.దుష్ట శక్తు లెల్ల దూరంబు పారగా
మంచి వారి నెల్ల మనిచె తల్లి
సప్త శతికి చేతు సాష్టాంగ  దండమ్ము
వందనాలు తల్లి వరము నొసగు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత