గురువు

అంతరాయమసలు నందనట్టిచదువు
అంతరజాలమ్ము నసలు లేక
దశగుణములొసగు దండమ్ము చేబూని
ఒజ్జనేర్పగలడు వోర్మి తోడ
గురువునేర్పుచదువు గుర్తుండి పోవును
కాలమ్ము గడిచినా కొరత లేక
చదువుతో బాటు సంస్కారమందించి
బాగుచేసెగురువు బడిని తాను
ఆ.వే గురువు లేని విద్య గుడ్డివిద్యయ
నుచు
పెద్ద లన్ని మాట చద్ది మూట
ఎన్ని వనరులున్న యెరుకలేకచదువ
ఫలిత మామి దక్కు  బాల వారు!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత