జై జగన్నాథ్

కనకమయపురథము కదిలింది ముందుకు
ఆగదెపుడుయింకయనవరతము
జయజగన్నాయకా జయముజయమునీకు
నీదురథముసాగె నిమ్మ ళమ్ము
నందిఘోషరథమునయనోత్సమట్లుగా
కనులముందుకదిలె కలతలుడిగె
ఆరదమాగుననచునావేదనంబాయె
చింతతీరె యిపుడు చిత్తమందు
బ్రతుకు భయము వీడి భక్తులెల్ల
కన్నులార్పకిటుల కాంచినారు
ఆ.వె.మనసు భద్రమాయె మాసుభ్రదమ్మతో
దర్పదళన మగును దండిగాను
భధ్రమగును కాదె బలభద్రు తోడుండ
పూర్ణ మాయె వాంఛ పూర్తిగా ను
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత