జనవిజ్ఞాన జాడ్యము
జనవిజ్ఞులని పేరుజాడ్యంబు పెద్దది
చెకుముకిరాయళ్ళ చెలియయదియె
స్వస్థతకూటాల సఖ్యుంబు చూపుచు
మనధర్మమన్నచో మత్సరమ్ము
మతమార్పిడులు పైన మనసులో నొకమాట
బయటనడవడంత భాష్క ళమ్ము
చార్వక మనగానె చాటంతముఖమౌను
చాటుగా మొక్కులు జరుపు గలరు
గతితర్కవాదనా గంతులే గంతులు
కాష్టవాదమనిన కాస్త జోరు
ఆ.వె. కుక్క తోక నూప కుందరదందురు
తోకెకుక్క నూపు తొలుత యనుచు
పలుకు చుందు రకట పలురీతు లట్లుగా
మూర్ఖ జనుల కేది మేర జగతి
(రచన:-- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి