వృధ్ధుడు

వృద్ధిపొందినభక్తి వృద్ధుని రూపాన
అర్చనంబొనరింప యందుకొనగ
కైలాస పతియంత కైవల్య మొసగగా
అరుదెంచునుచును నాశ పడెను
అభిషేక మొనరింప రానంద మందిన
అదియెపదివెలంచు నాశపడును
జవసత్వ విభవాలు జలజలా రాలిన
ధృడభక్తి యెక్కటి వృద్ధి యాయె
భవాయ దేవాయ శర్వాయదేవాయ
అనుచుండె తానెంతొ యార్తితోడ
భస్మాను లిప్తాంగ భవ్యమౌ లింగమ్ము
ప్రణతార్తి హరమైన భద్ర పదము
ఆ‌.వె లింగరూపమందు లీనమౌ విశ్వంబు
అట్టి పూజనంబె యధ్బుతంబు
శివుని జపము చేయ చింతార్థములనిచ్చు
ఇహముపరములెల్ల యీశుడొసగు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత