శ్రీవాణీ గిరిజలు

శ్రీవాణి గిరిజలుశ్రేయంబు గూర్చగా
రచియింతునేనింక రమ్య రచన
పంచాక్ష రీమంత్ర పరమపావనశక్తి
ప్రబలమౌ ప్రేరణ పాదుకొల్ప 
కవనరచనచేయ కలలోనిమాటగా
మనసుచెప్పెచునుండె మాటామాటా
వలెలాంబ తల్లియె వరమీయదాయంచు
సాహసమ్ము చేయగా చాలినాను
ఆ.వే.అమ్మ కరుణ నాకు నభయమొసగుచుండ
రచన చేతునింక రయముగాను
కలము కదలుశక్తి కరుణాంత రంగది
అంబకరుణ కల్గు నర్భకుండ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత