శ్రీరామా!
ఇక్ష్వాకు వంశాన యినతేజ మొప్పగా
దశరథ పుత్రుండు ధర్మ మూర్తి
రఘరాము డితడయ్య రాజీవ నేత్రుండు
జానకీనాథుడై జగతినేలె
కౌసల్య తనయుడై కమనీయ మూర్తియై
అందాల రాముడై యవని నేలె
సౌమిత్రి భ్రాతయై సౌజన్య మూర్తియై
ప్రియ దర్శ నుండుగా పేరు పొందె
భద్రాధి రాముడై పరమాత్మ తత్త్వమై
రామభక్తులకెల్ల రక్ష నొసగె
మనువు మాట శరము మార్చడెపుడుకూడ
శరణు వేడ గానెశరణ మొసగు
మాకు యతడె దిక్కు మరిమాట లేదోయి
ఇదియె చాలు మాకు నిహము పరము
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్థ్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి