అతడు
1వల్లమాలినట్టి వాత్సల్య భావమ్ము
అలవికాని యట్టి యాదరమ్ము
మాటలోన తీపి.మనసులోనవెగటు
తేనె పూసిన కొన్న తేలుకొండి
2నమ్మినట్టివారి నట్టేట ముంచగా
నటనమాడు నట్టి నర్తకుండు
సూక్తిసుధల తోడి సున్నంబు పూయగా
వచ్చినాడు వాడు వదలడింక
3
నక్క వినయ మొప్ప నయగారమెలకించి
పటికబెల్లమట్లుపలుకరించి
పరులకార్య మెల్లపాడుచేయునుగాని
బాగుచేయనట్టి పాపి యితడు
4పదవిపొందుదచేతబలియుడై చెలరేగి
మంచివారినెపుడు బాధపెట్టి
పదవియూడగానె పాతాళమున క్రుంగు
దుష్ట నరుని బ్రదుకు దుర్భరమ్ము
5మంచిపనులనెంచమచ్చుకైననులేవు
వెధవ పనులు పెంచే వేనవేలం
మెచ్చవలయు నెట్లు మెరమెచ్చు మాటల
నిజము పల్కు తంచు నింద వలదు
6తెలీవిలేకనీవు తెగువయేతోడుగా
చెనటిపనులనెల్ల చేసినాను
మంచివారినంత బాధించి బాధించి
అలసిసోలసినావు నాదమరచి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి