గురివింద గింజలు

గురివింద గింజకు గుర్తుగా వున్నట్టి
వీరాధి వీరులు వీధికొకరు
పరులతప్పులెపుడు పాతకములనుచు
నీతిబోధింతురెపుడు నిపుణతొప్ప
విదురుడైననుయేమి వీరి వద్దకు వచ్చి
సూక్తిసుధలు నేర్వ సుద్దికలదు
అవినీతి మాటను నసలేమి విన్నట్టు
వివరించగలరోయి వింతగాను
పత్తి త్తుమాటల పబ్బాలు గడవవు
నిజమునిప్పువోలెనిన్ను తాకు
ఆ.వె.పరుల వంచ నమ్ము పనికిరాదెప్పుడు
అగ్ని వంటిదోయి యసలునిజము
మభ్య పెట్టకోయి మనసునెపుడునీవు
నాగరాజు మాట నమ్ము మింక
(రచన:- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత