కుపుత్రుడు

అమ్మ నాన్నలనిన నభిమానమేలేక
వీదులందు వదులు వెడగువీడు
తీర్థయాత్రలనుచుతిన్నగాగొంపోయి
కాశిలోనవదులు కర్కశుండు
వీలునామానంత విశదమౌరీతి
తనపేర రాయుంచు తస్కరుండు
జన్మనొసగినట్టి జననీ జనకులను
కడసారి చూడని కఠిను డితడు
ఆ.వే పుడమిలోనె నింక పున్నామ నరకాన్ని
చూపు పుత్రు కన్న చుంచు మేలు
తల్లిదండ్రులన్న తాత్పర్యమేలేక
ఆస్తికొరకు చంపు నాతతాయి

【సంతానంచే పరిత్యజింప బడిన జననీజనకులకు అంకితము】

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత