నాస్తికము

విజ్ఞాన శాస్త్రంపు వైరుధ్య భావమ్ము
కర్తయే లేడను కల్పనమ్ము
పంచేంద్రియపు హద్దు పరమార్థ మనునట్టి
చార్వాక మతులతో చర్చ యేల
గతితర్క మనునట్టి మతిలేని మాటల
పబ్బంబు గడిపేటి  పాడుబుధ్ధి
అన్యమతపువారినసలేమియనరు
వేదోక్త విధియన్న వెక్కిరింత
ఆ.వె.నాస్తి కముల పేర నాటకాలాడుచు
చిన్న తెరల పైన చిందులేసి
గొంతు చించు టందు కోవిదత్త్వంబును
కథల యల్లుటందు గడసువారు
(రచన:- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత