రామజన్మభూమిఊ

జానకీ నాథుడా జన్మభూమియిదియె
వాసమ్ము చేయగా వసతి చిక్కె
త్రేతాయుగమునుంచి తిరుగడ బడితివే
కానన వాసంపు కాలమేగె
అయ్యొధ్య పురమంత యందాలు చిందగా
నీరాక కొరకంత నిలిచి యుండె
ధర్మమే గెలువగా ధరణిసంభ్రమమందె
ఆటంక మేమింక నరుగు దేర
ఆ.వే.రామ చంద్రు డన్న రాగను బంధమ్ము
తల్లి యన్న మాకుసీత తల్లి
లక్ష్మణండు మాకు రక్షకుండౌనింక
రాజ్య మనగ రామ రాజ్య మగును
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజు శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత