కళ్యాణ గాత్రుండు
కామితార్థ మొసగు కళ్యాణ గాత్రుండు
ఆపద మొక్కుల నందు కొనగ
శేషాద్రి నిలయుడై శేషజనుల బ్రోవ
ధరణికేతెంచెగా తలచె తాను
వైకుంఠ వాసమ్ము వైముఖ్య మాయెగా
స్వామిపుష్కరిణికి స్వామి చేరె
ఆనంద నిలయుని యార్తితో దర్శించ
జన్మమ్ము ధన్యంబు జగతిలోన
ఆ.వెతల్లి పాలలోని తన్మయభావమ్ము
అతనికరుణచేత నందగలము
భక్తి గమ్యుడైన భక్తార్తి భంజను
కొలువ వలయు మనము కోర్కె మీర
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి