ఇకిలింత సకిలింత

ఇల్లలికితిమంచు యికిలించ బోకండి
మొసలిదౌ పబ్బమ్ము ముందు గలదు
ధర్మమే జయమందు ధరలోన యెప్పుడు
కసిపోక తానంత మసినిపూయ
రోషంబు తీరదుదోషమే దక్కును
పగలెల్ల పగలనే పంచునెపుడు
మంచినిపెంచునె మచ్చుకైన ధరలోన
ఇంగితజ్ఞానమ్ము హితము కూర్చు
తాచెడ్డ దేకాక తోపంత చెరిచిన
మర్కట ప్రాయత మంచిదగునె
ఆ.వెపగలు వలన దృష్టి పొగజూరిపోవును
మంచిదనముకాస్త మసకబారు
పదవి శాశ్వతంబె బ్రహ్మకైనయెపుడు
ధర్మ మొకటె యెపుడు ధరను నిలుచు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత