చెకుముకి రాయళ్ళు

చెకుముకి రాయళ్ళు చెలరేగిపోతారు
హేతువాదమనుచు ప్రేతలట్లు
పరులమతములన్న పరవసిస్తారు
మనమతమనగానె మత్స రమ్ము
ఆచారమనగానె నవహేళ నంబులు
కూటాలవారితో కూడుతారు
జనవిజ్ఞులంటారు జాతర్లు జేస్తారు
నైతిక ధర్మాల నింద జేసి
ఆ.వేఇహముపరములన్ని యీలోక మంటారు
కుత్సి తంపు బుధ్ధి కుళ్ళి నట్లు
పాంచ భౌతికమ్మె పరమార్థ మంటారు
భ్రమల తోడ వీరు బ్రతుకు తారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత