అర్ధనారీశ్వరులు

భక్తితన్మయతతో భవరోగ వైద్యుని
మనసార పిలుతును మారు మారు
కైలాస పతినంత కైవల్య మూర్తిగా
పలుమారు పిలుతును భక్తిమీర
నందీశ్వరానంద నటరాజ మూర్తిని
ఆర్తితొ పిలుతును నరుగుదేర
పంచాక్ష రీమంత్ర  పరమేశు మహిమను
ప్రస్తుతించెదనింక పరవ శాన
ఆ.వే.అమ్మ నాన్న లింక నాదిదంపతులైన
కొరత యేమి మనకు కువలయాన
ప్రమథగణములన్ని బంధువులగుదురు
పుట్టి నిల్లు మనకు పుడమి యంత
(రచన౼ విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత