ఉట్టికెగరలేడు
మింగ మెతుకు లేదు మీసాలకేరీతి
సంపెంగ నూనెట్లు చాలు ననును
రాచనగరెలేదు రాణివాసమనుచు
రాజువోలెనతడు రభస చేయు
ఉట్టికెగరలేదు నుడివీధి పయనంబు
చేయవలెననచు చెప్పగలడు
అరచేత స్వర్గమ్ము నందుకో నీవంచు
ఆర్భాట మొనరించి నాశ పెట్టు
ఆ.వె.సిగ్గు యెగ్గు లనుచు చీకాకు పడకుండ
వెధవ వేష మేయు వేళకొకటి
ధరణిభారమంత తనమీద పడెనంచు
కథలు చెప్పునతడు ఘడియకొకటి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి