మాతృమూర్తి

కాశిభట్ల గోత్ర కౌస్తుభా భరణమ్ము
గోల్ల పిన్ని వారి కోహినూరు
రామభక్తితోడ రంజిల్లు నగుమోము
మమత సమత లెల్ల మాకు నేర్పె
బాల్య మందు నేర్పె బాలరామచరిత
ఖడ్గమాల మంత్ర ఖడ్గ మిచ్చె
అమ్మతోడ నాకు ననుబంధ మధికమ్ము
అమృత మెట్లు ఘనము నమ్మ కన్న

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత