వేసవి

భీష్మించినా వచ్చె గ్రీష్మంబు తానంత
రోహిణి కార్తెలో రోళ్ళుపగుల
వహ్నిశిఖలవోలె వడగాలి వీయగా
ప్రాణలపైయాశ పైకిపోయె
నిప్పులు చెరిగేటి నిడుపైన బాటపై
ఎండమావులజాడ యింక చూడు
నిప్పుల కుంపట్లు నీచెంత యున్నట్లు
అనుపించ నీకింక యనుభవమ్మె
చన్నీటి తానమ్ము చల్లబరుచునుమేను
వద్ధనదుమనసు వంటికెపుడు
కుండలో నీరంత కుతితీర తాగగా
దాహంబు కాసింత  తగ్గునోయి
కానుగ చెట్టంత కాపాడు నీడతో
కాసంత చల్లగా గాలివీయ
ఆ‌.వె.ఆరుబయటి గాలినాప్యాయమందించ
కుక్కి మంచమందు కునుకు తీయ
నాక లోక మేలు నరులకింకయనుచు
తలచు చుందురకట ధరణి జనులు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత