వరలక్ష్మి
వరలక్ష్మి యైతానువరమునొసగుతల్లి
కమలాలయైతాను కరుణ జూపు
పద్మాలయైతాను పరమార్థ మొసగెను
ధనలక్ష్మియైతాను ధనమునొసగు
ఆదిలక్ష్మి గాతాను నమ్మయై నాదరించు
విద్యకు లక్ష్మియై విద్యనొసగు
విజయమొసగుతానువీరలక్ష్మీదేవి
రణరంగమందున రక్షనిచ్చి
ధాన్యలక్ష్మీదేవి తానయై ధాన్యాదులనొసగి
కరువురక్కసినంత కాలరాచి
తనను కొలిచి నట్టి తనవారినందరిని
కంటి రెప్పలాగ కాయి తల్లి
అమ్మ నమ్మ వారి నాదుకొనునుకాదె
తల్లిలీల నెపుడు తలతు నేను
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి